ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు
అమరావతి: పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు.
తెలంగాణలోనూ ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అధికారికంగా మొత్తం 13 రోజులపాటు పండగ సెలవులిచ్చారు. వచ్చే నెల 4న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.