AP&TG

అందరం కలసి నడిస్తే, మహిళల సాధికారత త్వరిలోనే సాధ్యం-స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తిరుపతి: మహిళల సమాన హక్కులు,రాజకీయాలలో మరింత ప్రాతినిధ్యం,విద్య, ఉపాధి, ఆర్థిక రంగాలలో అవకాశాలు,సురక్షిత సమాజ నిర్మాణం – ఇవన్నీ కేవలం నినాదాలు కావు అని, ఇవి మనం కలసి సాధించాల్సిన లక్ష్యాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల.అయ్యన్నపాత్రుడు అన్నారు.సోమవారం రాహుల్ కన్వెన్షన్ సెంటర్, తిరుపతిలో నిర్వహిస్తున్న ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు-శాసనసభ కమిటీల జాతీయ సదస్సు”చివరి రోజులో భాగంగా స్పీకర్ ప్రసంగిస్తూ రెండు రోజులు సదస్సులో విశ్లేషించిన సమస్యలు, జరిగిన చర్చలు, పంచుకున్న అనుభవాలు – ఇవన్నీ కలిపి మనకో కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయన్నారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఒక స్పష్టమైన సందేశం వెలువడిందని,  మహిళా సాధికారత అంటే ఆప్షన్, అవకాశం, భావన, గమ్యం అన్నింటికీ ఆత్మతత్వమని ఇది మనకున్న కలను ముందుకు తీసుకెళ్లడానికి జాతీయ స్థాయి లక్ష్యమన్నారు.

కుటుంబ వ్యవస్థలను:- మహిళా శక్తి మనకు ప్రగతి శక్తి అని ఆ శక్తిని సద్వినియోగం చేసుకున్న దిశలో వినియోగించగలిగితే, మన దేశం మరింత బలపడుతుందన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో తీసుకున్న ఆలోచనలు, తీర్మానాలు కేవలం కాగితాలలోనే కాకుండా, ప్రజల జీవితాలలో మార్పులు తీసుకురావడానికీ ఉపయోగపడాలన్నారు. ప్రజా ప్రతినిధులుగా మనం కేవలం హాజరుకావడం కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించే మార్గాలను కనుగొని వాటిని అమలు చేయడమే మన ప్రధాన బాధ్యతగా ఉండాలన్నారు. కుటుంబ వ్యవస్థలను బలపరిచేలా చేయడం, మహిళా క్రియాశీలతగా మార్పడం – ఇదే మన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *