యువతిపై హిజ్రాలు దాడి-అవమానంతో ఆత్మహత్య
హిజ్రాల మధ్య గొవడతో హత్య…
హిజ్రాల మధ్య వచ్చిన సెటిమెంట్ వ్యావహరంతో గత సంవత్సరం నెల్లూరులో హసిని అనే హిజ్రాను హత్య చేయగా,, తాజాగా విజయవాడలో హిజ్రాలు దాడి చేయడంతో అవమానం తట్టుకోలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది..హిజ్రాల పేరుతో అతి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శుభ, అశుభ కార్యం ఏదైనా సరే దందా మెుదలుపెడతారు.ఈ లాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా ఎందుకు వ్యవహరించారు??
అమరావతి: ట్రాన్స్ జండర్స్ అంటే సమాజంలో వారి పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుభూతి వ్యక్తం అవుతుంది..దింతో వారు చపట్లు కొడుతూ దుకాణల వద్ద,,రోడ్డుపై వెళ్లే వారి వద్ద డబ్బులు కోసం చేతులు చాపుతారు..దింతో ఎవరికి తొచినంత వారు ఇస్తూవుంటారు..అయితే ఈ రకంగా వచ్చే సంపాదన ఎక్కువ కావడంతో ట్రాన్స్ జండర్స్ కాని యువకులు,,ట్రాన్స్ జండర్స్ లా దుస్తులు ధరించి చేతులు చాపి యాచించడంతో పాటు డబ్బులు ఇవ్వమంటూ అతి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తూ బెదిరించే ఘటనలో ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి..ట్రాన్స్ జండర్స్ పేరుతో వీరిలో కొన్ని గ్రూప్స్ తయారు అయ్యాయి..ఇలా తయారు అయిన గ్రూపులు,,సెటిల్ మెంట్స్ చేసే స్థాయికి ఎదిగారు..ఈ గ్రూపులు మధ్య గొడవలు ఏ స్థాయికి చేరాయంటే,,
దారుణంగా హత్య:- 2024 నవంబరు 26వ తేదిన నెల్లూరు నగరంకు దగ్గరలో హసిని అనే ట్రాన్స్ జెండర్స్ ను 15 మంది వ్యక్తులు కలసి దారుణంగా హత్య చేశారు..హత్య జరిగిన వారం రోజుల్లో పోలీసులు 12 మంది అరెస్ట్ చేసి,మీడియా ముందు ప్రవేశ పెట్టారు..ఈ హత్యకు ఆసలు కారణం సెటిమెంట్ అని నగరవాసులు వ్యాఖ్యనించారు.. ఇది ఇలా వుంటే…..
యువతి ఆత్మహత్యా:- హిజ్రాల తీరుతో తాజాగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గిరిపురానికి చెందిన కుమారి అనే యువతిపై ఈనెల 11న కొందరు హిజ్రాలు దాడి చేశారు. అత్యంత దారుణంగా అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కొట్టారు. ఆ అవమానం తట్టుకోలేక అదే రోజు ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందతున్న సదరు యువతి శినివారం చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది. హిజ్రాల దాడికి ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.