దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి-ప్రధాని మోదీ
అమరావతి: మిజోరంలోని సైరాంగ్ వద్ద తొలి రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంను కలుపుతూ కీలకమైన అడుగు పడింది. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిజోరంలోని సైరంగ్ స్టేషన్ నుంచి రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ కు 12 కి.మీ దూరంలో ఉన్న తొలి రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ.8,070 కోట్ల వ్యయం అయ్యింది. ప్రతి రాష్ట్ర రాజధానిని రైలు ద్వారా అనుసంధానించాలనే లక్ష్యంలో భాగంగా మిజోరం రాజధానిని భారత రైల్వే మ్యాప్‌లో చేర్చడం ఇదే మొదటిసారి. అలాగే మరికొన్ని ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక ప్రసంగం చేశారు.
సవాళ్లతో కూడి కొండ ప్రాంతాల మీదుగా:- పెను సవాళ్లతో ఎదురైయ్యే బైరాబి-సైరాంగ్ మార్గం 51.38 కిలో మీటర్లు విస్తరించి, ఈశాన్యంలోని అత్యంత కష్టమైన కొండ ప్రాంతాలలో మధ్య వెళుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో 48 సొరంగాలు, 142 వంతెనలు (55 పెద్ద, 87 చిన్న వంతెనలు), బహుళ రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలు ఉన్నాయని తెలిపారు.
రైల్వేల ఇంజనీరింగ్ సామర్థ్యం:- కష్టతరమైన భూభాగం, తరచుగా కొండచరియలు విరిగిపడటం, తక్కువ పని సీజన్లు అమలును సవాలుగా మార్చాయి, అయితే మన భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ సామర్థ్యాలను కూడా ప్రదర్శించాయని తెలిపారు. ఈ కొత్త కనెక్షన్‌తో గువహతి, అగర్తల, ఇటానగర్ తర్వాత జాతీయ రైల్వే నెట్‌వర్క్ తో అనుసంధానించబడిన 4వ ఈశాన్య రాష్ట్ర రాజధానిగా ఐజ్వాల్ అవతరించిందని ప్రధాని మోదీ వెల్లడించారు.
సామాజిక,ఆర్థిక అభివృద్ధి:- ఏ రాష్ట్రాభివృద్ధికైనా రోడ్డు, రైల్వే, పోర్టు కనెక్టివిటీ ముఖ్యం అని పేర్కొన్నారు. మిజోరాం అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు.ఈ ప్రాజెక్ట్ నిర్మణం పూర్తి కావడంతో రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయం కలసి వస్తుందని తెలిపారు. మిజోరాంలో నివాసం వుంటున్న ప్రజలకు వస్తువులు, రవాణా ఖర్చులు ఆదా అవుతాయని,, దింతొ పర్యాటకం, వాణిజ్యం, ఉపాధిని పెంచడంతో పాటు ఈ ప్రాంతంలో వేగంగా సామాజిక,ఆర్థిక అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.