శనివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం-APSDMA
అమరావతి: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని,,దీనికి అనుబంధంగా ద్రోణి కొనసాగుతుందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు..మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని,,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.శనివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.