NATIONAL

భారత 15వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్‌

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌

అమరావతి: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,హోం మంత్రి అమిత్ షా,మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు NDA భాగస్వామ్యపక్షాల అభినందనలు తెలిపారు.

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎట్టకేలకు దర్శనమిచ్చారు. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా అనంతరం ఆయన బయట ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ప్రొటోకాల్‌ ప్రకారం, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *