సిఎం అంటే కామన్ మ్యాన్ అని చెపుతున్నా-కలెక్టర్లు మీరూ అదే పాటించండి- సిఎం చంద్రబాబు
కలెక్టర్లు బదిలీ…..1.పార్వతీపురంమన్యం-ప్రభాకర్ రెడ్డి,,2.విజయనగరం-రామసుందర్ రెడ్డి,,3.ఈస్ట్ గోదావరి-కీర్తి చేకూరి,,4.గుంటూరు-తమీమ్ అన్సారియా,,5.పల్నాడు-కృతిక శుక్లా,,6.బాపట్ల-వినోద్ కుమార్,,7.ప్రకాశం-రాజా బాబు,,8.నెల్లూరు-హిమాన్షు శుక్లా,,9.అన్నమయ్య-నిషాంత్ కుమార్,,10.కర్నూలు-డాక్టర్ ఎ సిరి,,11.అనంతపురం-ఓ.ఆనంద్,,12.సత్య సాయి-శ్యాంప్రసాద్.
అమరావతి: ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం మాట్లాడారు. సమర్థవంతమైన పాలన అందించే విషయంలో వారికి దిశా నిర్థేశం చేశారు.360 డిగ్రీల్లో పనితీరు పరిశీలించి మీకు కలెక్టర్లుగా అవకాశం ఇచ్చాను….నా ఆలోచనలు, అంచనాలు అందుకోండి… బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వండి అని సిఎం సూచించారు. సిఎం అంటే కామన్ మ్యాన్ అని నేను చెపుతున్నా… మీరూ అదే పాటించండి… ప్రజలకు అందుబాటులో ఉండండి…. నిత్యం వారితో మమేకం అవ్వండి… అన్నింటికీ రూల్స్ కాదు… మానవీయ కోణంలో పనిచేయండి. అప్పుడే మీకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని సిఎం అన్నారు.
ఇతర జిల్లాలతో పోటీ పడండి- మీ నిర్ణయాలు క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా ఉండాలి… కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి… ప్రతి దానికీ డబ్బులు లేవు అని కూర్చుంటే పని అవ్వదు. నేను అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నెంబర్ 1 గా ఉండాలి అని అందరితో పోటీ పడుతుంటా…. మీరు కూడా అన్ని జిల్లాల కంటే ముందు ఉండాలని ఇతర జిల్లాలతో పోటీ పడాలి. ముందుండాలి అనే కసి, పట్టుదల మీకు కనిపించాలి. అసత్యాలు ప్రచారం చేసే మీడియా, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్ అవర్ లోనే మీరు రెస్పాండ్ అవ్వాలి. మనం చేసేది ప్రజల్లోకి వెళ్లాలి…. లేకపోతే అసత్యాలే నిజం అని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కలెక్టర్ అనేది అధికారం కాదు. అహంకారం, ఈగోలు వద్దు…. కామన్ మ్యాన్ గా ఉండాలన్నారు.