NATIONAL

భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించిన సి.పి.రాధాకృష్ణన్‌

అమరావతి: భారత ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. NDA అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమి తరుఫున పోటీ చేసిన జస్టిస్ బి సుర్దాసన్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయనకు 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.

452 ఓట్లుతో ఘన విజయం:- భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పార్లమెంటు నూతన భవనంలోని F101 వసుధ’Blockలో పోలింగ్ జరగింది. ఉప రాష్ట్రపతి పదవికి జరిగి ఎన్నికల్లో NDA అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి. మొత్తం 781 మంది ఎంపీలలో 14 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండగా 15 ఓట్లు చెల్లనివిగా వచ్చాయి. మొత్తం 767 ఓట్లు పోల్ అయ్యాయి సి.పి. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో సి.పి. రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారుల ప్రకటించారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *