26 సోషల్ మీడియా ప్లాట్ ఫారంలపై నిషేధం-నిరసనలు-కాల్పుల్లో 15 మంది మృతి
పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ…
అమరావతి: నేపాల్ ప్రభుత్వం Instagram, YouTube, X (Twitter), Facebook సహా 26 సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను పూర్తిగా నిషేధించింది.దింతో నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం కొన్ని వందల మంది యువతీ, యువకులు ఒక ప్రక్క సోషల్ మీడియా సైట్లను బ్యాన్ చేయడం,,మరో ప్రక్క నేపాల్ లో అవినితి పెరిగిపోయిదంటూ ప్రధాన మంత్రి కె.పి శర్మ ఓలీకి వ్యతిరేకంగా జెన్ జీ (GEN Z) పేరుతో ఖాట్మాండు వీధుల్లోకి వచ్చి నిరసనలు మొదలుపెట్టారు. అనంతరం పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టి మెయిన్ గేట్ బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రవేశ ద్వారానికి నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన యువత వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రబ్బరు బుల్లెట్లతో వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది మరణించగా దాదాపు 100 మంది వరకు గాయపడినట్లు సమాచారం. గాయపడ్డవారిలో ముగ్గురు జర్నలిస్టులు ఉన్నట్లు తెలుస్తొంది. యువత నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేలా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది.తొలుత యువత నిరసనలు శాంతియుతంగానే మొదలు అయినప్పటికి కొన్ని గంటల తర్వాత హింసాత్మకంగా మారాయి.
గురువారం ప్రభుత్వం నిర్ణయం:- నేపాల్ ప్రభుత్వం వద్ద రిజిస్టర్ కాని సోషల్ మీడియా సైట్‌లను నిషేధిస్తున్నట్లు కమ్యూనికేషన్స్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ గురువారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.మంత్రి గురుంగ్, మంత్రిత్వ శాఖ అధికారులు, నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ ప్రతినిధులు, టెలికాం ఆపరేటర్లు-ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు హాజరైన సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారు. సమావేశంలో, నమోదుకాని సామాజిక సైట్‌లను నిలిపివేయాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీకి సూచించింది.
సోషల్ మీడియా సైట్‌ల్లోని కాలింగ్:- పని కోసం విదేశాలకు వలస వచ్చిన వారి కుటుంబాలతో కనెక్ట్ అవ్వడానికి నేపాలీలు ప్రత్యేకంగా వాట్సాప్, బోటిమ్, మెటా మెసెంజర్, వైబర్ వంటి సోషల్ మీడియా సైట్‌లను-సోషల్ మీడియా సైట్‌ల్లోని కాలింగ్ అప్లికేషన్‌లను ఉపయోగిస్తారు. 2024 ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, నేపాల్ వ్యక్తిగత చెల్లింపులు GDPలో 33.06%గా అంచనా వేశారు.