చంద్రగ్రహణం సందర్భంగా కనకదుర్గా ఆలయం మూసివేత
అమరావతి: సెంప్టబరు 7వ తేదిన చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని మూసివేయడం జరుగుతుందని,,ఈ సందర్భంగా ప్రధాన దేవాలయంతో పాటు ఉప ఆలయాలన్నింటినీ మూసివేయబడతాయని ఆలయ ఈ.వో సీనా నాయక్ తెలిపారు..
ఆలయ మూసివేత వివరాలు:- 07-09-2025 (ఆదివారం) మధ్యాహ్నం 3:30 నుండి ‘కవాట బంధనం’తో ఆలయం మూసివేయబడుతుంది.తిరిగి 8వ తేది ఉదయం 8:30 గంటల నుంచి భక్తులకు అన్ని రకాల దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

