LRS పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించండి-కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార, అక్రమ లేఔట్లలోని ప్లాట్ల యజమానులు యాజమాన్యపు హక్కులను పొందేందుకు పట్టణ ప్రణాళిక విభాగం అందుబాటులోకి తెచ్చిన ఎల్.ఆర్.ఎస్. మార్గదర్శకాలపై లే అవుట్ల యజమానులకు అవగాహన కల్పించి, పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశించారు. సోమవారం కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
కట్టడాలను తొలగించి వేస్తాం:- ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనధికార, అక్రమ నిర్మాణాలను నగర వ్యాప్తంగా గుర్తించి నోటీసులను జారీ చేయాలని ఆదేశించారు. రోడ్డు అక్రమణలు, డ్రైను కాలువల పై అడ్డంగా నిర్మించిన ర్యాంపులు, మెట్లు తదితర నిర్మాణాలను, అనుమతులకు మించి నిర్మించిన కట్టడాలను తొలగించి వేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి రోడ్డు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల గురించి, మార్టగేజ్ విడుదల గురించి అర్జీలు అందుకున్నామని తెలిపారు.
51 ఫిర్యాదులు:- ఇంజనీరింగ్ విభాగానికి సంభందించి రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణం, సివిల్ వర్కులు, వీధి దీపాల ఏర్పాటు తదితర సమస్యలను అందుకున్నామని తెలిపారు. రెవెన్యూ విభాగం నుంచి అసెస్మెంట్ మార్పులు, నూతన ఇంటిపన్ను దరఖాస్తులు, ఇంటి పన్నులో మార్పులు తదితర అంశాలపై ఫిర్యాదులను అందుకున్నామని తెలిపారు. విభాగాల వారీగా ఇంజనీరింగ్ – 4, హౌసింగ్ – 18, టౌన్ ప్లానింగ్ – 10, రెవెన్యూ – 9, పబ్లిక్ హెల్త్ – 4, ఆప్కాస్ – 5, అకౌంట్ సెక్షన్ – 1, మొత్తం – 51 ఫిర్యాదులను అందుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కనకాద్రి, తీసుకున్నప్పుడు హిమవిందు, టిపి.ఆర్.ఓ వాసుబాబు, మేనేజర్ రాజేశ్వరి, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరెంటెండెంట్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

