ఇరు దేశాల ప్రజల సంక్షేమం ద్వైపాక్షిక సహకారంతో ముడిపడి ఉంది-ప్రధాని మోదీ
అమరావతి: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేఃశం అయ్యారు.. రెండు రోజులు పర్యటనలో భాగంగా శనివారం తియాన్‌జిన్ చేరుకున్న ప్రధాని మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు..
ప్రధాని నరేంద్రమోదీ, సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం:- షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మధ్య సమావేశం జరిగింది..పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో చర్చల సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు..ఇరు దేశాల ప్రజల సంక్షేమం ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారంతో ముడిపడి ఉందని అలాగే సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు..
జిన్‌పింగ్, చైనా, భారతదేశాలు పురాతన నాగరికతలు:- .చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ, రెండు దేశాలు స్నేహితులుగా ఉండటం అవసరం అని అన్నారు.. చైనా, భారతదేశం తూర్పున రెండు పురాతన నాగరికతలు కలిగిన దేశాలననారు.. ప్రపంచంలోనే రెండు అత్యధిక జనాభా కలిగిన దేశాలు. గ్లోబల్ సౌత్ లో కూడా రెండు దేశాలు ముఖ్యమైన సభ్యులం.. పక్కపక్కనే ఉన్న మనం,, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటూ, రెండు దేశాలు అభివృద్ధికి దోహదపడే భాగస్వాములుగా ఉండటం ఇరుదేశాలకు సరైన ఎంపిక అని జిన్‌పింగ్ అన్నారు.. ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం భారత్, చైనాలు బాధ్యతను తీసుకోవాలని జిన్ పింగ్ పిలుపునిచ్చారు.