98వ ఆస్కార్ అవార్డుల పోటీలో ఎంట్రీ సాధించిన “పాపా బుకా”
అమరావతి: మాలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన పా రంజిత్ సహ నిర్మాతగా వ్యవహరించిన “పాపా బుకా” అనే చిత్రం 98వ ఆస్కార్ అవార్డుల పోటీకి ఎంట్రీ సాధించడం విశేషం.. పపువా న్యూ గినీ( PNG) దేశం నుంచి అర్హత సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సాధించింది.. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ చిత్రం పోటీ పడనున్న నేపథ్యంలో పా రంజిత్ సంతోషం వ్యక్తం చేశారు.. తమ నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ గర్వించదగ్గ క్షణమని ఆయన అన్నారు..పపువా న్యూ గినియా దేశం ఎంట్రీగా ఈ చిత్రం ఎంపికైందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు..
ఈ చిత్ర కథ:- రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ సైన్యం తరపును పీఎన్జీలో పోరాడిన భారతీయ సైనికుల గురించి చాటి చెప్పారు..ఈ చిత్రానికి మూడు నేషనల్ అవార్డ్స్ అందుకున్న మలయాళ దర్శకుడు బిజు కుమార్ దమోదరన్ దర్శకత్వం వహించారు.. పపువా న్యూ గినీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తి కాబోతున్న క్రమంలో నోయెలిన్, భారతీయులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.