నౌకాదళంలో రెండు యుద్ధనౌకలు ఒకే సారి ప్రవేశ పెట్టడడం తొలి సారి-రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అమరావతి: భారతదేశ చరిత్రలో నౌకాదళంలో రెండు యుద్ధనౌకలు ఒకే సారి ప్రవేశ పెట్టడడం ఇదే తొలి సారి..నౌకాదళానికి చెందిన నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగేట్లు INS ఉదయగిరి, INS హిమగిరిని మంగళవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో విధుల్లోకి ప్రవేశపెట్టారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ భారత నావికాదళం బాధ్యత కేవలం సముద్రాన్ని పరిరక్షించడానికే పరిమితం కాదని, దేశ ఆర్థిక భద్రతకు కీలక స్తంభం అన్నారు.. ఆత్మనిర్భర్ భారత్ కలలు సాకారమయ్యాయన్నారు.. భారత ఇంధన అవసరాలైన చమురు, సహజ వాయువులు తీరప్రాంత భద్రతపై ఆధారపడి ఉంటాయని చెప్పారు..ప్రాజెక్టు-17 ఆల్ఫా కింద వీటిని పూర్తిగా దేశీయంగానే నిర్మించారు.. INS ఉదయగిరిని ముంబైలోని మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించగా, INS హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) తయారు చేసింది..ఇవి భారత నౌకాదళంలో కీలకం విధులు నిర్వహించనున్నాయి..అత్యఅధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు వీటిలో అమర్చారు..