భారీ వర్షాలు ధాటికి అతలా కుతలం అవుతున్న జమ్ము-నాలుగురు మృతి
అమరావతి: ఒక వైపు వాతావరణశాఖ భారీ వర్షాలు అంటూ హెచ్చరికలు,,ఇదే సమయంలో ఎత్తైన ప్రాంతాల్లో క్రౌడ్‌బరస్ట్ ల కారణంగా జమ్మూలోని పలు ప్రాంతాల్లో ప్రధాన నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి..దోడా జిల్లాలో మంగళవారం నాడు మెరుపు వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోపోయారు..కొండచరియలు విరిగిపడుతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి రాకపోకలను నిలిపివేశారు..దోదాలోని కీలకమైన రోడ్డు కొట్టుకుపోయింది..పలు నదులు ఇప్పటికే ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్న నేపధ్యంలో జమ్మూ ప్రాంతంలో అధికారులు వరద ముప్పును ప్రకటించారు..
15.56 సెంటీమీటర్ల వర్షపాతం:- కథువా జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా 15.56 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది..అలాగే దోడాలోని బదెర్వాహ్ 9.99 సెంటీమీటర్లు,,జమ్మూలో 8.15 సెంటీమీటర్లు కాత్రాలో 6.89 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.. ఎత్తైన కొండ ప్రాంతాల్లో క్రౌడ్‌బరస్ట్ లు, మెరుపు వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో పలు నదుల్లో నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది..అత్యవసర పరిస్థితుల దృష్ట్య ప్రజల కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ మెంబర్లను ప్రకటించింది..