BUSINESSNATIONALOTHERS

“మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” అనే లక్ష్యం వైపు భారత్-ప్రధాని మోదీ

అమరావతి: గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆత్మనిర్భర్‌గా మారడానికి వేగంగా అడుగులు వేస్తున్నామని,, ,గణేశోత్సవాల పండుగ ఉత్సాహం మధ్య, భారతదేశం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రయాణానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..మంగళవారం గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో గ్రీన్ మొబిలిటీ సెంటర్ ను ప్రారంభించారు..ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” అనే ఉమ్మడి లక్ష్యం వైపు ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు..దేశంలో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ తయారీని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు..భారతదేశం-జపాన్ మధ్య స్నేహానికి ఈ రోజు కొత్త కోణాన్ని తీసుకువస్తుందని,, భారతదేశ పౌరులందరికీ, జపాన్‌-సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు..

మొబైల్​ ఉత్పత్తి 2,700 శాతం:- యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్​ వైపు చూస్తోందని, ఈ సమయంలో ఏ రాష్ట్రం వెనుకబడి ఉండకూదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు..ప్రతి రాష్ట్రం అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేయాలని సూచించారు..మన దేశానికి వచ్చే పెట్టుబడిదారులు ఏ రాష్ట్రానికి వెళ్లాలో అర్థం కాక అయోమయంకు గురి కావాలన్నారు.. ఇందుకోసం అభివృద్ధి ఆధారిత,, సుపరిపాలన విధానాలను రూపొందించేందుకు అన్ని రాష్ట్రాలు పోటీపడాలని కోరారు.. వ్యాపారంలో డబ్బులు ఎవరు పెట్టినా సరే, పని మాత్రం భారతీయులతోనే జరగడమే స్వదేశీ మంత్రమని అన్నారు..గత దశాబ్ద కాలంలో భారత్​లో ఎలక్ట్రానిక్స్​ ఉత్పత్తి 500 శాతానికి పెరిగిందని ప్రధాని మోదీ అభినందించారు.. ముఖ్యంగా మొబైల్​ ఉత్పత్తి 2,700 శాతం, రక్షణ రంగ ఉత్పత్తులు 200 శాతానికి పెరిగాయని గుర్తు చేశారు..మేకిన్​ ఇండియాకు గర్వించ తగిన రోజ,, ఇక్కడ తయారైన వాహనాలు వందలాది దేశాలకు ఎగమతి అవుతున్నాయని తెలిపారు.

భారత్​లో తయారీ అయిన కార్లు జపాన్​కు ఎగుమతి:-  జపాన్​కు చెందిన సుజుకీ సంస్థ భారత్​లో కార్లు తయారీ చేస్తుంది..ఇక్కడ తయారీ చేసిన కార్లను జపాన్​కు తిరిగి ఎగుమతి చేస్తున్నాం.. ఇది కేవలం భారత్​- జపాన్​ మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచానికి భారత్​పై ఉన్న నమ్మకాన్ని బలోపేతం చేస్తోందన్నారు.. మారుతీ సుజుకీ లాంటి సంస్థలు మేకిన్​ ఇండియాకు ప్రచారకర్తలు,, ఇక్కడ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు మేడిన్​ ఇండియా అని రాసి అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *