భారత్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి-రష్యా వ్యాపార వేత్తలకు జైశంకర్ ఆహ్వనం
అమెరికా టారిఫ్ కు విరుగుడు….
అమెరికా తన అవసరల కోసం ఎలాంటి నీచమైన పనులకైన బరితెగించే ప్రవృత్తి వున్న దేశం..దశాబ్దలుగా భారతదేశంను అణగత్రొక్కేందుకు వెన్నుపోటు విధానలను ఉపయోగిస్తునే వుంది..భారతదేశం అభివృద్ది చెందడం అమోరికాకు తొలి నుంచి ఇష్టం లేదు..అందుకే ఇస్రో క్రయోజెనికి టెక్నాలాజీని రష్యా నుంచి పొందకుండా అక్షాంలు విధించింది..ఉక్రెయిన్-రష్యా యుద్దం ప్రారంభం అయిన తరువాత భారతదేశంకు రష్యా డిస్కొంట్ అయిల్ ను ఇవ్వడం చూసి,అమెరికా ఓర్చుకోలేక పోతుంది..ప్రపంచ మూడో అతి పెద్ద అర్ధిక వ్యవస్థగా ఎదగడం సహించలేక పోతుంది..అందుకే,టారిఫ్ ల పేరుతో భారతదేశ అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తొంది..అమెరికా వేస్తున్న నీచమైన ప్లాన్స్ ను తిప్పికొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం చకచక పావులు కదుపుతొంది..ఇందులో బాగంగా…
అమరావతి: రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. భారత్-రష్యా సంబంధాలు మరింత సృజనాత్మకంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు.. భారత్‌లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలను ఆహ్వానించారు.. మాస్కోలో బుధవారం జరిగిన భారత్–రష్యా ఇంటర్నల్ గవర్నమెంట్ కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు.. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్‌తో సమావేశం అయ్యారు.. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.. ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడంతో పాటు వివిధ అంశాల్లో సహకరించుకోవాలని మంత్రి జైశంకర్ సూచించారు..”ఎక్కువ చేయాలి,విభిన్నంగా చేయాలి” అన్నదే ఇరు దేశాల వాణిజ్యమంత్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు..
వాణిజ్య లోటు తగ్గించుకోవాలి:- గడిచిన నాలుగు సంవత్సరాల్లో భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందని జైశంకర్ స్పష్టం చేశారు..అయితే పెరుగుదలతో పాటు భారీ అసమాతలు వచ్చాయన్నారు..‘2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న రెండు దేశాల వాణిజ్యం 2024-25లో 68 బిలియన్ డాలర్లకు చేరింది.. అయితే, 2021లో 6.6 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఇప్పుడు 59 బిలియన్ డాలర్లకు పెరిగి,, తొమ్మిది రెట్లుకు చేరుకుందన్నారు..దీనిని తక్షణమే పరిష్కరించుకోవాలి’ అని జైశంకర్ అభిప్రాయపడ్డారు.. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని ఆయన గుర్తు చేశారు..మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ వాణిజ్యానికి కొత్త ద్వారాలు తెరిచిందన్నారు.. భారత్‌లో రష్యా కంపెనీల వ్యాపార విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందన్నారు.