AP&TGCRIME

ధర్మవరంలో నూర్ మహమ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు, స్థానికులను భయాందోళనలకు గురిచేసింది…కోట కాలనీలో నివాసం వుంటున్న నూర్ మహమ్మద్(40) అనే అనుమానిత ఉగ్రవాదిని NIA అదుపులోకి తీసుకుంది.. ధర్మవరంలోని మార్కెట్ ప్రాంతంలో టీ స్టాల్ లో పనిచేస్తున్న నూర్ మహమ్మద్,,15 సంవత్సరాల క్రిందట ధర్మవరంకు వచ్చి నివాసం వుండడం ప్రారంభించాడు..ఇటీవల ధర్మవరం ప్రాంతంలో ఒక స్థలం కొనుగొలు చేసి,,విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తున్నాడు..ఇతని ప్రవర్తను సందేహస్పదంగా వుంటుందని స్థానికులు అధికారులకు వివరించినట్లు తెలుస్తొంది..

16 సిమ్‌కార్డులను స్వాధీనం:- ఇతను పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాడని తెలుస్తోంది..ఈ ఆపరేషన్‌ను NIA అత్యంత గోప్యంగా నిర్వహించింది.. గత కొంతకాలంగా నూర్‌ మహమ్మద్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు,, పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది..నూర్ మహమ్మద్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 16 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు..భారతదేశం, నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన whatsup గ్రూపుల్లో నూర్ మహమ్మద్‌ సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం.. ముస్లిం యువకులను అతడు ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు IB అధికారులు గుర్తించారు..

ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్:- ఆన్ లైన్ యాప్స్ ద్వారా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్,,ఇతర ఉగ్రవాద సంస్థలతో నూర్ మహమ్మద్ మాట్లాడినట్టు అధికారులు కనుగొన్నారు..పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ’జై పాకిస్తాన్’ అంటూ నూర్ మహమ్మద్ నినాదాలు చేసినట్లు సమాచారం..ఉగ్రవాది నూర్ మహమ్మద్ కు సంబంధించిన వివరాలను NIA కూపీ లాగుతున్న సమయంలో ఒక మహిళ గురించి వివరాలు బయటపడినట్లు సమాచారం..తాడిపర్తిలో నివాసం వుంటున్న ఒక మహిళ(35)ని నూర్ మహమ్మద్ తరుచు కలుసుకుంటాడు.. NIA అధికారలు ఈమెను కూడా అదుపులోకి తీసుకుని విచారణకు తీసుకుని వెళ్లినట్లు సమాచారం..అలాగే  ధర్మవరానికి చెందిన రియాజ్ అనే యువకుడు,, పాకిస్తాన్ జెండాతో పాటు పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఇన్ ప్లూయన్స్ ర్ సయ్యద్ బిలాల్ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు..ధర్మవరం పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *