పులివెందుల,ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన కూటమి అభ్యర్దులు
అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కూటమి అభ్యర్దులు ఘన విజయం సాధించారు.. వైసీపీ అధినేత జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన ZPTC ఉపఎన్నికలో YSRCP అభ్యర్థికి కేవలం 685 ఓట్లు రావడంతో డిపాజిట్ కోల్పోయరని,పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు..కూటమి అభ్యర్థి B.Tech రవి సతీమణి మారెడ్డి లతారెడ్డికి 6735 ఓట్లు రాగా, 6050 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించదన్నారు.. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు..కూటమి ప్రభుత్వం పులివెందులలో చేసిన అభివృద్ధి,సంక్షేమం చూసిన తరువాతే ఓటర్లు తమ అభ్యర్దిని గెలిచారన్నారు..ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసిన తరువాత వైసీపీ ప్రణాళిక ప్రకారం అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు..జగన్ అరాచకానికి,అహంకారానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని, ఈ ఫలితాలతో జగన్ కు కనువిప్పు కలగాలి అన్నారు.
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలో కూటమి అభ్యర్ది ముద్దుకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు..రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి-6351 రాగా.. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి-12505 వచ్చాయి.. టీడీపీ మెజారిటీ 6154కు చేరింది.

