రోడ్డు మార్జిన్ పరిధిని దాటిన ఫ్రూట్ షాపుకు రూ.10 జరిమాన విధించిన కమీషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లను ఆక్రమిస్తూ నిర్మిస్తున్న కట్టడాలను అన్ని డివిజన్లలో గుర్తించి, సంబంధిత నోటీసులను జారీ చేసి వాటిని తొలగించాలని కమిషనర్ వై.ఓ నందన్ టౌన్ ప్లానింగ్ అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ స్థానిక మద్రాసు బస్టాండ్ కూడలి నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఆచారి వీధి పరిసర ప్రాంతాలలో గురువారం పర్యటించారు.
సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నోటీసులు:- పర్యటనలో భాగంగా ఆచారి వీధి రోడ్డును ఆక్రమిస్తూ ఇరుపక్కల ఉన్న ఆక్రమణలను, వ్యాపారాలను కమిషనర్ గమనించి, సంబంధిత వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నోటీసులు జారీ చేసి వెంటనే ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్దేశించిన రోడ్డు మార్జిన్ ప్రతి ఒక్కరు గుర్తించేలా మార్కింగ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.అనంతరం స్థానిక అయ్యప్పగుడి కల్లూరుపల్లి రోడ్డులో జరుగుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనులను ఆర్ అండ్ బి అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.
ఎమ్.ఎస్ ఫ్రూట్ షాపు రోడ్డు మార్జిన్:- అనంతరం రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలోని ఎమ్.ఎస్ ఫ్రూట్ షాపు రోడ్డు మార్జిన్ పరిధిని దాటి విక్రయాలు జరుగుతుండటం కమిషనర్ గమనించి, షాపు నిర్వాహకులకు పదివేల రూపాయల జరిమానా విధించారు. నిర్దేశించిన పరిధి మేరకే వ్యాపారాలు జరుపుకోవాలని, రోడ్డు ఆక్రమణలను సహించబోమని కమిషనర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, సర్వేయర్,ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

