జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించిన సైన్యం
అమరావతి: దేశ ప్రజలు 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరుపుకునే వేళ,,జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సైన్యం తుడిపెట్టేసింది..బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్ కుట్రను ఆర్మీ భగ్నం చేసింది..భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పుల్లో హతమయ్యారు.. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు..వాస్తవాధీన రేఖ (LOC) వద్ద భద్రతా బలగాలు అధునాతన ఆయుధాలతో సరిహద్దును కంటికి రెప్పలా కాపాడుతున్నాయి..
రోబోలతో కూంబింగ్:- రాజోరి జిల్లా సుందర్‌బని అడవి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని వున్నరన్న సమాచారంతో అధునాతన రోబోలతో ఈ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.. ఉగ్రవాదులు అమర్చిన IEDలను నిర్వీర్యం చేసేందుకు సైన్యం రోబోలతో,,డాగ్ స్క్వాడ్‌ను కూడా ఉపయోగిస్తున్నారు..
గుహల్లో తిష్టవేసి:- యూరీ సెక్టార్‌లో కీలక ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా పెట్టడడంతో పాటు అధునాతన ఆయుధాలతో ఉగ్రవాదులను ఏరివేసే కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది..ఉగ్రవాదుల కాల్పులకు ధీటైన సమాధానం ఇవ్వడానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఆర్మీ వినియోగిస్తోంది..ఉగ్రవాదులు గత కొంతకాలంగా LOC లోని అటవీ ప్రాంతాలను తమ స్థావరాలుగా మార్చుకుని,,నెలల తరబడి గుహల్లో తిష్టవేసి జమ్ముకశ్మీర్‌లో దాడులకు పాల్పడి పారిపోతున్నారు..ఈ విషయంను పసిగట్టిన భద్రత సిబ్బంది ఉగ్రవాదులు తల దాచుకుంటున్న గుహలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.