రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
అల్లూరి,కోనసీమ,ఏలూరు, ఎన్టీఆర్,కృష్ణా,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు,మిగతా జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది….
అమరావతి: పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో బలపడి,,రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా ఈ అల్పపీడనం కదిలే అవకాశం వుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొంది..వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో హోం-విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు.. విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి, డైరెక్టర్ ప్రఖార్ జైన్ , కోస్తా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో భారీ వర్షాలపై చర్చించారు..ఆల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సూచించారు..వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, విపత్తులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు..నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.. ప్రకాశం బ్యారేజ్‌కు వరద కొనసాగుతుండడంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. ఇన్‌ప్లో, ఔట్‌ఫ్లో 3,97,250 క్యూసెక్కులు వున్న నేపధ్యంలో మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు..కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు..
ఈ నెల 18 న మరో అల్పపీడనం:- నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావముతో రాబోయే ఆరు రోజుల్లో రాష్ట్రములోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచన వేస్తొంది..ఆగస్టు 13,14,15,16 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది..ఈ నెల 18 న మరో అల్పపీడనం ఏర్పడ నుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.