బెంగళూరు న్యూ ఇండియా ఎదుగుదలకు చిహ్నం-ప్రధాని మోదీ
అమరావతి: బెంగళూరు మెట్రో ఫేజ్-2(ఎల్లో లైన్) ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు..ఈ సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతోందని,,ప్రపంచ వేదికలపై నాయకత్వం వహించే స్థితిలో ఉందని అభిప్రాయపడ్డారు. “మన నగరాలు స్మార్ట్‌గా,, వేగంగా,,మౌలిక వసతులు కల్పించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు..అధునిక మౌలిక సదుపాయాలను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు..21వ శతాబ్దంలో పట్టణ ప్రణాళిక,,మౌలిక సదుపాయాలు అవసరం ఎంతగానో వుందన్నారు..బెంగళూరు వంటి నగరాలను భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంచాలి ఎందుకంటే, బెంగళూరుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందన్నారు.. బెంగళూరును న్యూ ఇండియా ఎదుగుదలకు చిహ్నంగా మనం చూస్తున్నమన్నారు..
RV రోడ్డు నుంచి బొమ్మసంద్ర:- నగరంలోని ఐటీహబ్‌ను అనుసంధానించే అనేక కారిడార్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో ఈ లైన్ అభివృద్ది చేశారు..ప్రధాని మోదీ RV రోడ్డు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు.. ప్రయాణ సమయంలో విద్యార్థులతో ముచ్చటించారు..RV రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు 19 కి.మీలకు పైగా ఉన్న ఈ మార్గంలో దాదాపు 16 స్టేషన్లు ఉన్నాయి..ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.7,160 కోట్లు..ఎల్లో లైన్ ప్రారంభంతో బెంగళూరులో ఆపరేషనల్ మెట్రో రైలు నెట్ వర్క్ 96 కి.మీలకు పైగా పెరుగుతుంది.. “కొత్త ప్రాజెక్ట్ వల్ల హోసూర్ రోడ్, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీ జంక్షన్ వంటి అనేక రద్దీగా ఉండే కారిడార్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.