తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి
తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వి.ఐ.పీ విరామ సమయంలో కేంద్ర రోడ్డు రవాణా- రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈఓ వెంకయ్య, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి.శ్రీనివాసులు ఉన్నారు.

