లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధంచి రూ.11 కోట్ల నగదును సీజ్ చేసిన సిట్
అమరావతి: 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ పాలన సమయంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో A-40 నిందితుడు వరుణ్ ఇచ్చిన వాంగ్మూలంతో సిట్ అధికారులు తెలంగాణలోని ఒక ఫాంహౌస నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకుని,,సీజ్ చేశారు.. A1 రాజ్ కెసిరెడ్డి అదేశాలతో 12 బాక్సుల్లో రూ.11 కోట్ల నగదును దాచిపెట్టినట్లు వరుణ్ తెలిపారు..రంగారెడ్డి జిల్లా, కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో ఈ డబ్బును అధికారులు గుర్తించారు.. వరుణ్ మంగళవారం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రాగానే సిట్ అధికారులు అయన్నుఅరెస్ట్ చేశారు..మద్యం కుంభకోణంలో దొచుకున్న నగదును ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ? లేక ఎక్కడ దాచి పెట్టారో తెలుసుకునేందుకు ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డిని కూడా అధికారులు ప్రశ్నించారు..సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ ఓనర్ పేరు విజయేందర్‌రెడ్డిగా అధికారులు గుర్తించారు..ఆయన తల్లి సులోచన పేరునే ఫామ్‌హౌస్‌కి పెట్టారు..ఇందులోని స్టోరు రూమ్‌లో బియ్యం బస్తాల మధ్య నగదు బాక్సులు పెట్టారు.

