ఆగష్టు 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్టులు పంపిణీ-మంత్రి నాదెండ్ల
అమరావతి: రాష్ట్రంలో కోటి 40 లక్షల 96 వేల 86 రేషన్ కార్డులు ఉన్నాయని,,పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజ్ చేశామని,,కార్డులపై ఎక్కడా నాయకుల ఫొటోలు ఉండకూడదని డిజైన్ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు..కార్డులపై కుటుంబసభ్యుల ఫొటోలు మాత్రమే రేషన్ కార్డులో ఉంటాయని,,వీటిని డెబిట్, క్రెడిట్ కార్డు సైజుల్లో ఇవ్వబోతున్నామని తెలిపారు..ఆగష్టు 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ఈ కార్డులు అందిస్తామని ప్రకటించారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇస్తారని, రాష్ట్రస్ధాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్డులు పంపిణీ చేస్తారని వెల్లడించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే సెంట్రల్ ఆఫీసులో తెలుస్తుందని తెలిపారు..జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రప్రభుత్వం రేషన్ పంపిణీ చేస్తోందని వెల్లడించారు..కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం కార్డులను భరిస్తున్నాయని వెల్లడించారు.. కార్డులు అన్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు.

