NATIONALOTHERSWORLD

నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుపై అధికారిక సమాచారం లేదు-విదేశాంగశాఖ

అమరావతి: యెమెన్‌ జాతీయుడు మహద్‌ హత్యకేసులో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దైందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండిస్తూ,,ఈ వార్తలు అవాస్తవమని పేర్కొంది.. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని మంగళవారం వెల్లడించాయి..

అధికారిక సమాచారం రాలేదు:- నిమిష ఉరిశిక్షను రద్దు చేస్తూ యెమెన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది.. అక్కడ జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ఉరిశిక్షణ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.. దీనిపై భారత విదేశాంగ శాఖ వర్గాలు స్పందిస్తూ ఈ విషయంపై తమకు యెమెన్‌ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి.

తన పాస్‌పోర్టు కోసం:- యెమెన్‌ జాతీయుడు మహద్‌తో కలిసి నిమిష వ్యాపారం చేసింది.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె తన పాస్‌పోర్టు కోసం ఇవ్వలని అడిగింది..పాస్‌పోర్టు ఇచ్చేందుకు మహద్‌ నిరాకరించడంతో అతడికి మత్తుమందు ఇచ్చి తన పాస్‌పోర్టు తీసుకునేందుకు నిమిష ప్రయత్నించింది..అయితే డోస్‌ ఎక్కువ కావడంతో మహద్‌ మరణించాడు..నిమిషను యెమెన్‌ పోలీసులు హత్య కేసులో అరెస్ట్‌ చేశారు..ఆమె ముందుగా స్థానిక కోర్టు మరణశక్ష విధించింది.. ఆ శిక్షను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది..దింతో జూలై 16న నిమిషకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించారు.. నిమిషకు శిక్ష తప్పించేందుకు చివరి నిమిషం వరకు భారత ప్రభుత్వం ప్రయత్నించింది.. జూలై 16న అమలు చేయాల్సిన మరణశిక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *