దాచిగమ్ నేషనల్ పార్కు వద్ద ఎన్ కౌంటర్,ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హాతం
అమరావతి: జమ్మూ కశ్మీర్ శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్కు సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడిన వారిగా ప్రచారం జరుగుతోంది..ఇప్పటి వరకు ఈ సంఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్షాల సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా “ఆపరేషన్ మహదేవ్” చేపట్టింది. సోమవారం ఉదయం 11 గంటలకు దాచిగమ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో భద్రతా దళాల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులపై ఒక్కొక్కరి మీద రూ. 20 లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. ఆసిఫ్ ఫౌజీ,,సులేమాన్‌షా,,అబూ తల్హా అనే ఉగ్రవాదులు హతం అయినట్టు సమాచారం.మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని,,లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించినట్లు శ్రీనగర్ SSP జివి సందీప్ చక్రవర్తి తెలిపారు.సంఘటనాస్థలిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు పహల్గాం దాడి ఉగ్రవాదులుగా ప్రచారం జరుగుతుంది.ఉగ్రవాదుల ఆచూకీని గుర్తించేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

