ఇస్రో, నాసాలు తయారు చేసిన నిసార్ ఉపగ్రహం ఈ నెల 30న నింగిలోకి
శ్రీహరికోట నుంచి ప్రయోగం..
అమరావతి: ఇస్రో, నాసాలు సంయుక్తంగా రూ.13,000 కోట్ల ఖర్చుతో తయారు చేసిన నిసార్ ఉపగ్రహం నుంచి జూలై 30న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి వెళ్లనున్నది.. ఈ ఉపగ్రహం భూమి మొత్తాన్ని 12 రోజుల్లో స్కాన్ చేస్తుంది.. భూమికి సంబంధించి అత్యంత కచ్చితమైన(పిన్ పాయింట్) తో చిత్రాలను అందిస్తుంది..ఇది భారత్, అమెరికాల మధ్య స్పేస్ కోపరేషన్‌లో చారిత్రక మలుపుగా భావించవచ్చు.. NISAR (NASA-ISRO SAR) నిసార్ అంటే నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్..ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల అంచనా, పర్యావరణ పరిశీలనలో విప్లవాత్మక మార్పు తీసుకురానుంది..
ఇస్రో GSLV-F16 ద్వారా నిసార్:-నిసార్ రెండు రాడార్ ఫ్రీక్వెన్సీలతో పనిచేసే ప్రపంచపు మొట్టమొదటి ఉపగ్రహం..నాసా L-Band, ఇస్రో S-Bandలు ఇండిపెండెట్ రాడార్‌లుగా పనిచేస్తాయి..2,392 కిలోలు బరువు ఈ శాటిలైట్ ను ఇస్రో GSLV-F16 ద్వారా 743 కిలోమీటర్ల ఎత్తులో సన్-సింక్రనస్ కక్షలో ప్రవేశపెడతారు..నిసార్,పగలు, రాత్రి, వర్షం,మంచు వంటి పరిస్థితులకు అతీతంగా స్థిరమైన డేటాను సేకరిస్తుంది..అలాగే ప్రతి 12 రోజులకు ఒక సారి భూఉపరితల చిత్రాలను చాలా స్పష్టతతో ఫోటోలు తీస్తుంది..
భూమిపై దాదాపు ప్రతి అంగుళం దిని పరిధిలోకి:- నిసార్,,ఇప్పటివరకు నిర్మించిన భూ పరిశీలన ఉపగ్రహాలలో అత్యంత ఖరీదైనది..ఇందులో 12 మీటర్ల పొడవుతో మెష్ యాంటెన్నా, అధునాతన డ్యూయల్ రాడార్ వ్యవస్థ ఉన్నాయి..భూమిపై కిలోమీటర్ స్థాయిలో జరిగే మార్పులను సైతం గుర్తిస్తుంది.. భూకంపాలు, హిమనీనదాలు కరిగిపోవడం, భూమి కుంగిపోవడం వంటి అంశాలను అంచనా వేయడంలో ఇది కీలకమైన సమాచారం చేరవేస్తుంది…ఇస్రో ఈ ప్రాజెక్టులో రూ.788 కోట్లు ఖర్చు చేస్తోంది..
ప్రపంచానికి ఉచితంగా నిసార్ శాటిలైట్ డేటా:- నిసార్ శాటిలైట్ డేటా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది..ఇది ఒక రకంగా చెప్పాలంటే (ఓపెన్ సోర్స్ డేటా) శాస్త్రీయ, వాతావరణ పరిశోధనలో విజయాలతో దూసుకుని పోతున్న భారతదేశానికి ప్రపంచంలో స్థాయిలో మరో మైలు రాయిగా నిలుస్తుంది..ఈ శాటిలైట్ ప్రయోగం కేవలం భారత్-అమెరికాకే కాకుండా భూమి మొత్తానికి మిషన్‌లాంటిది..ఈ శాటిలైట్ ప్రయోగం మానవతా దృష్టితో రూపొందించారు..
రాడార్‌ల పనితీరు:-నాసా L-BAND రాడార్ భూమి, అడవులు, మంచు, లోతైన నేల నిర్మాణాలను గమనిస్తుంది..ఇస్రో S-BAND రాడార్ పంటల నిర్మాణం, ఎర్త్ ప్టేట్స్ మూమెంట్స్ ను, ఉపరితల వ్యత్యాసాలను గుర్తిస్తుంది..ఈ రాడార్‌లు 5 నుంచి 10 మీటర్ల రిజల్యూషన్‌తో 242 కిలోమీటర్ల వరకు చిత్రాలు తీస్తాయి.
