డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ ప్రయోగం విజయవంతం
అమరావతి: భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (DRDO) డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్-V3ని (ULPGM) విజయవంతంగా ప్రయోగించింది..కర్నూల్‌లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు..పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ రక్షణ రంగ సామర్థ్యాల అభివృద్ధికి ఈ ప్రయోగం గొప్ప ప్రోత్సాహకమని వ్యాఖ్యానించారు..
లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో:- డ్రోన్స్ ద్వారా ప్రయోగించే పలు ఆయుధాల అభివృద్ధిపై ఎయిరో ఇండియా-2025 షోలో DRDO ప్రదర్శించింది..ఇన్‌ఫ్రారెడ్ సీకర్స్,, డ్యుయెల్ థ్రస్ట్ ప్రొపల్షన్ వ్యవస్థలను ఆవిష్కరించింది..డ్రోన్స్ తో పాటు ఇతర వేదికల నుంచి ప్రయోగించే విధంగా ULPGMను అభివృద్ధి చేస్తోంది..సుదూరాన ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసేలా ఈ తేలిక పాటి మిసైల్‌ను DRDO అభివృద్ధి చేస్తోంది..
లేజర్ ఆధారిత ఆయుధాలు:- కర్నూల్‌లోని ప్రయోగ వేదికలో ఆయుధ పరీక్షలకు సంబంధించి ఇటీవల ఇక్కడ లేజర్ ఆధారిత ఆయుధాలను (DEW) కూడా విజయవంతంగా పరీక్షించారు..ఫిక్స్ డ్ వింగ్ UAVలు, స్వార్మ్ డ్రోన్స్ ను ధ్వంసం చేసేలా DEWలను అభివృద్ధి చేశారు..శత్రుదేశ దాడులను తిప్పికొట్టడం,,నిఘాతో పాటు ప్రతిదాడులు చేసేందుకు అవసరమైన అనేక డ్రోన్స్ ను DRDO అభివృద్ధి చేస్తోంది.. దీర్ఘశ్రేణి లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేసే తపస్,, ఆర్చర్ డ్రోన్స్ తో పాటు శత్రు దేశ నిఘాకు చిక్కని ఘాతక్,, స్విఫ్ట్ డ్రోన్స్ ను అభివృద్ధి చేసింది..షార్ట్ రేంజ్ నిఘా కోసం పుష్పక్, గోల్డెన్ హాక్ వంటి డ్రోన్స్ ను కూడా DRDO పరిక్షించింది..ఈ ప్రయోగల్లో DRDOతో పాటు పలు ప్రైవేటు రక్షణ రంగ సంస్థలు,,స్టార్టప్‌లు పాల్గొంటున్నాయి.

