రష్యాలో ఘోర విమాన ప్రమాదం,49 మంది మృతి
అమరావతి: రష్యాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్ విమానం గురువారం ఉదయం ఘోరా ప్రమాదంకు గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న 49 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు..అంగారా ఎయిర్‌లైన్స్ కు చెందిన AN-24 ప్యాసింజెర్ విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్ నుంచి చైనా శివారు ప్రాంతం టైండా పట్టణానికి బయల్దేరింది.. కొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుందన్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధలు కోల్పోయింది..టైండా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.. తొలుత ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయలోం వాతావరణం అనుకూలించలేదని,,మళ్లీ రెండోసారి ల్యాండింగ్ సమయంలో ఈ విమానం ర్యాడార్ నుంచి అదృశ్యం అయినట్లు లోకల్ ఎమర్జన్సీ అధికారులు టెలిగ్రామ్ కు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.. ప్రమాద చోటు చేసుకున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయని వెల్లడించింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్త సంస్థ వెల్లడించింది..ప్రమాదం జరిగేందుకు గల కారణలను అన్వేషించేందుకు, రష్యా, దర్యాప్తు బృందంను పంపించినట్లు వార్త సంస్థలు వెల్లడించాయి..

