ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్-రాజమండ్రి సెంట్రల్ జైలుకు..
అమరావతి: 2019-2024 మధ్య జరిగిన లిక్కర్ స్కాం కేసులో నిందితుడు,, A4 గా వున్న రాజంపేట వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి కోర్టు అగష్టు 1వ తేది వరకు (14 రోజుల) రిమాండ్ విధించింది..మిథున్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేసిన సిట్,,అదివారం కోర్టులో ప్రవేశపెట్టాగా,, విజయవాడ ACB కోర్టు మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు..రిమాండ్ విధిస్తే మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో వున్న నెల్లూరు లేదా రాజమండ్రి జైలుకు తీసుకెళ్లాలని, ACB కోర్టు 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జికి, మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు విన్నవించారు.. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ప్రభుత్వానికి రూ.3500 కోట్లు నష్టం:- సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు.. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టం ఉందని,,ఆయన్ని కుట్రదారుడిగా పేర్కొంది.. లిక్కర్ పాలసీ మార్పు,, అమలు,,డిస్టిలరీలు,, సప్లయర్స్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.. డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లుగా ఆరోపించారు.. అంతేకాకుండా లిక్కర్ డబ్బును 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు..మిథున్ రెడ్డి కుట్రలతో ప్రభుత్వానికి రూ.3500 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు..ఆయన్నీ కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని,, అందుకే రిమాండ్ విధించాలని సిట్ కోర్టును కొరింది.

