టీటీడీలో పనిచేస్తున్న నాలుగురు అన్యమత ఉద్యోగులను ఎట్టకేలకు సస్పెండ్
(టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని,, హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేని అన్యమత ఉద్యోగులు టీటీడీలో ఎందుకు పని చేస్తున్నరని కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ నెల 11వ తేదిన శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియా వేదికగా టీటీడీ నిలదీశారు..టీటీడీలోని హిందు ఉద్యోగులు గతంలో తెలిపిన లెక్క ప్రకారం దాదాపు 324 మంది అన్యమతస్థులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.?) ప్రశ్నించారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటిస్తున్న నేపధ్యంలో,,టీటీడీ అధికారులు కంటి తుడపు చర్యగా అన్యమతం అచరిస్తున్న నాలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం,,మిగిలిన వారికి సంబంధించిన ఫైల్ రెడీ అయినప్పటికి ఎందుకు వారి పేర్లను తొక్కి పెట్టి వున్నారు అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు..ఇందుకు సమాధానం ఎవరు ఇస్తారో వేచిచూడాలి??
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం 4 అన్యమత ఉద్యోగులను ఎట్టకేలకు సస్పెండ్ చేసింది..ఈ విషయమై శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది..టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్-డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్),, ఎస్.రోసి, స్టాప్‌నర్స్(బర్డ్ ఆస్పత్రి),, ఎం.ప్రేమావతి-గ్రేడ్-1 ఫార్మసిస్ట్ (బర్డ్ ఆస్పత్రి),, డా.జి.అసుంత-ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీల్లో విధులు నిర్వహిస్తున్నారు..నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని,, అందుకు సంబంధించిన ఆధారాలు, వీరిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు తలిపారు..వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని వెల్లడించారు..హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించారని పేర్కొన్నారు.. ఈ నేపధ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

