వర్షాకాలం ప్రారంభం,రోడ్లు,బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి-కమిషనర్
నెల్లూరు: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కమిషనర్ నందన్ అదేశించారు. నగరంలో పారిశుధ్య పనులను శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన రోడ్లను క్రమంతప్పకుండా శుభ్రం చేయాలని, ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి వారి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా హెచ్చరిక బోర్డులతో సూచనలు ఇవ్వాలని వెల్లడించారు. వర్షపు నీరు ప్రవహించేందుకు వీలుగా అన్ని డ్రైను కాలువల్లో పూడికతీత, మురుగు తొలగింపు పనులను ప్రతిరోజూ చేపట్టాలని ఆదేశించారు.దోమల ఎదుగుదలకు దోహదపడే మంచినీటి సరఫరాలో లీకేజీ ప్రాంతాలు, వాడి పడేసిన టైర్లలో నిల్వ ఉండే నీరు, బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేసిన ఖాళీ కొబ్బరి బోండాలలో నిల్వ ఉండే వర్షపు నీరు, పూల కుండీలు, వాడకంలో లేని నీటి తొట్లు, బావులపై ప్రజలందరికీ చైతన్యం కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ శానిటేషన్ విభాగం సూపర్ వైజర్లు, ఇన్స్పెక్టర్ లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

