మీ రాజకీయల కోసం పోలీసు వ్యవస్థను కించపర్చవద్దు-శ్రీనివాసరావు
అమరావతి: పోలీసు అధికారులు,పోలీసు వ్యవస్థను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై అంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు,,జనరల్ సెక్రటరీ హజరత్తయ్యలు తీవ్రంగా ఖండించారు..గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంల వారు మాట్లాడుతూ ప్రతిపక్షంలో వున్న రాజకీయ నాయకులు ప్రతీ అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు..మాజీ ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలతో మా మనోస్థైరధ్యం దెబ్బతినడంతో,,తాము మీడియా ముందుకు రావల్సి వచ్చిందన్నారు.. వైసీపీ నాయకులను అరెస్టు చేసేందుకు మాత్రమే పోలీసు వ్యవస్థ ఉందని,, తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడటం సరి కాదన్నారు..చట్టానికి ఎవరూ అతీతులు కాదని తెలుసుకోవాలని హితవుపలికారు..
డీజీపీని టార్గెట్ చేయడం ఏమిటి:- వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని,, అరెస్ట్ లు చేశామని గుర్తు చేశారు.. పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని,, వి.ఆర్ కు పంపించడం అనేది పాలనలో ఒక బాగం అన్నారు..ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని,, వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు.. ఎమ్మెల్యేలు, మంత్రులకు పోలీసులు వాటాలు పంచుతున్నారని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు..డీఐజీ స్థాయి అధికారిని డాన్ అని అరోపించడం,,రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నడిపించే డీజీపీని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు..
మీ రాజకీయాల కోసం:- పోలీసులు ఎప్పుడూ ఏ ఒక్కరికో కొమ్ము కాయరని,,ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చట్ట ప్రకారం తాము పని చేస్తామని వెల్లడించారు.. పోలీసుల వల్ల ఇబ్బంది కలిగితే న్యాయ స్థానాల ద్వారా చర్యలు తీసుకోవచ్చన్నారు.. మీ రాజకీయాల కోసం పోలీసు వ్యవస్థ పరువు తీయవద్దని కోరారు..IPS అధికారి సిద్ధార్థ కౌశిల్ సొంత కారణాలతో రాజీనామా చేశారని,,అయితే ఆ అంశాన్ని డీజీపీకి, ప్రభుత్వానికి ఆపాదించి అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.. వైసీపీ ప్రభుత్వంలోనూ తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని,,ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
మేము ఇలాగే స్పందిస్తాం:- మా పోలీసు వ్యవస్థను ఎవరు కించపరిచినా మేము ఇలాగే స్పందిస్తామన్నారు..ప్రతీ వివాదంలో పోలీసులపై విమర్శలు చేయడం షరామాములుగా మారిందని,, ఈ విధానం కరెక్ట్ కాదని,, మా మనోభావాలను దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడవద్దని కోరారు..