డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో అగ్నిప్రమాదం
అమరావతి: తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు అంటుకున్నాయి.. ఇండియన్ ఆయిల్ కంపెనీ డీజిల్‌తో 52 వ్యాగన్లతో కూడిన గూడ్సు రైలు చెన్నై పోర్టు నుంచి బెంగళూరుకు వెళ్తున్నసమయంలో తిరువల్లూరు సమీపంలో రైలోలోని ఓ వ్యాగన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..మంటలు ఐదు వ్యాగన్లకు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి..దీంతో ఆ ప్రాంతంలో నల్లటి పొగలు దట్టంగా అలముకున్నాయి..సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు..ఇదే సమయంలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగించాయి.. ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.. అలాగే చెన్నై-అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేశారు..ప్రమాదం జరిగిన