దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు-రెక్టార్ స్కేల్‌పై 4.4
అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది.. భూప్రకంపనల తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 4.4గా నమోదు అయింది.. భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురై,,ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, ఝజ్జర్, బహదూర్‌గఢ్ సహా అనేక నగరాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి.. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉందని అధికారులు తెలపారు.. భూప్రకంపనల కేంద్రం పశ్చిమ ఢిల్లీకి 51 కిలో మీటర్ల దూరంలో ఉంని, రాజస్థాన్, యూపీలోని పలు ప్రదేశాల్లోనూ భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు..భూప్రకంపనల రావటానికి కొన్ని గంటల ముందు ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం కురవడంతో, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి..ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది..రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.మెట్రో స్టేషన్లు, పిల్లర్ల మీద నుంచి నీరు జలపాతంలాగా ప్రవహింది..

