NATIONALOTHERSWORLD

పాకిస్థాన్ లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్

అమరావతి: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధికారికంగా పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను క్లోజ్ చేసింది..గత కొన్ని సంవత్సరాలుగా ఇస్లామాబాద్‌లో టెక్ కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత శనివారం ఈ నిర్ణయం తీసుకుంది.. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ మాజీ కంట్రీ మేనేజర్ జావాద్ రెహ్మాన్ లింక్డ్ఇన్‌లోని చేసిన ఒక పోస్ట్‌ లో కార్యకలపాలను నిలిపివేయడం నిజమే అన్నారు..ఇదే విషయంను పాకిస్తాన్ న్యూస్ పోర్టల్ డాన్ కూడా ధృవీకరించింది..

మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్‌లో కార్యకలపాలను నిలిపివేయడంతో పాకిస్థాన్ లో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది.. 25 సంవత్సరాల నుంచి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ లో కార్యకలపాలు నిర్వహిస్తొంది..దేశంలో రాజకీయ అస్థిరత కారణంగా అవకాశాలను కోల్పోతున్నామని,,పాకిస్థాన్లో తన కార్యకలాపాలను నిలిపి వేయాలన్న మైక్రోసాఫ్ట్‌ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిణామమని పాక్‌ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ ఆరిఫ్‌ అల్వీ వ్యాఖ్యానిస్తూన్నారు.. 2022లో బిల్‌గేట్స్‌, పాక్‌ పర్యటనకు వచ్చినప్పుడు పాక్ లో పెట్టుబడులు పెట్టాలని కోరగా, బిల్ గేట్స్ సానుకూలంగా స్పందించారని, వెంటనే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌‌తో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదేళ్లను మాట్లాడించారని గుర్తు చేసుకున్నారు..అనంతరం భారీ పెట్టుబడులకు ప్రణాళికలు రచించామని,, కొంత కాలానికే ప్రభుత్వం మారడం,,అనంతర పరిణామాల వల్ల మైక్రోసాఫ్ట్‌ వియత్నాం వైపు వెళ్లిపోయిందన్నారు..పాకిస్థాన్ లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అస్థిరత, అధిక పన్నులు, కరెన్సీ సమస్యలు, ఇంకా వాణిజ్య పరిమితులకు లోబడి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ మాజీ అధిపతి జావాద్ రెహ్మాన్ పేర్కొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *