మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు హతం
అమరావతి: మావోయిస్టులకు గట్టి ఎదురదెబ్బ తగిలింది.. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం వేకువజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం అయ్యారు. ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల.రవి అలియాస్ ఉదయ్,, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ ఉన్నారు..అలాగే మరో మావోయిస్టు అంజుగా గుర్తించినట్లు సమాచారం..మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

