జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా బాద్యతలు స్వీకరించిన శివశంకర్ రావు
నెల్లూరు: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా A.శివశంకర్ రావు సోమవారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. వీరు ప్రస్తుతం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ గా ఇదే కార్యాలయం లో పనిచేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న కే.సదారావును విశాఖపట్నం DIPRO గా బదిలీ అయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వపరంగా సేవలను అందిస్తానని బాధ్యతల స్వీకరణ సందర్భంగా DIPRO శివశంకర్ తెలిపారు.

