మంత్రులు అనవసరమైన విషయాలపై మాట్లాడడం మానుకొండి-ప్రధాని మోదీ
ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియచేయండి..
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.. మంత్రులు అందరూ తమ తమ మంత్రిత్వ శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అలాగే అనవసరమైన ప్రకటనలు చేయవద్దని,, తమ మంత్రిత్వ శాఖలు కాకుండా ఇతర అంశాలపై మాట్లాడటం మానుకోవాలని ప్రధాని మోదీ మంత్రులకు సూచించినట్లు సమాచారం.. గడచిన 11 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని ప్రధాని మంత్రులను కోరినట్లు తెలిసింది..NDA ప్రభుత్వం సాధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విజయాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించినట్లు తెలియ వచ్చింది..బళ్లారి-చికజాజూరు రైల్వే డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది..ఈ లైన్ నిర్మాణంతో పశ్చిమ తీరంలో ఉన్న మంగళూరు పోర్టుకు ఆంధ్రప్రదేశ్ తోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్కు కనెక్టివిటీ లభిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.. బళ్లారి , చిత్రదుర్గ, అనంతపురం మీదుగా లైన్ను నిర్మిస్తారు..3342 కోట్లతో 185 కిలొమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ పనులకు ఆమోదం లభించింది..దీంతో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది..మొత్తం 185 కిలోమీటర్లు, 19 స్టేషన్లు, 29 పెద్ద వంతెనలు, 230 చిన్న వంతెనలు, 21 రోబ్లు, 85 రబ్లు ఏర్పాటు చేయనున్నారు.. దాదాపు 470 గ్రామాలకు కనెక్టివిటీ, 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఐరన్ ఓర్, కోకింగ్ కోల్, స్టీల్, ఎరువులు, ధాన్యం, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు అనుకూలంగా మారనున్నాయి.. దాదాపు18.9 మిలియన్ టన్నుల అదనపు సరుకుల రవాణాకు వీలవుతుంది.

