ఆధార్ కార్డు ఆధారంగా తత్కాల్ టిక్కెట్లు బుకింగ్-రైల్వేశాఖ
అమరావతి: జూలై 1, 2025 నుంచి ఆధార్ కార్డు ఆధారంగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. “తత్కాల్ పథకం కింద టిక్కెట్లను ఆధార్ కార్డు వున్న ప్రయాణికులు IRCTC లేదా UTS యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు” అని మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రచురించిన సర్క్యులర్‌లో తెలిపింది..
అత్యవసర ప్రయాణించే వారి కోసం రైల్వేశాఖ ప్రవేశ పెట్టిన,, రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు విడుదల చేసే తత్కాల్ టిక్కెట్లు తరచుగా కొన్ని సెకన్లలోనే-తరచుగా ఆటోమేటెడ్ బాట్లు లేదా బుకింగ్ ఏజెంట్ల ద్వారా అయిపోతాయి..తత్కాల్ పథకం ప్రయోజనాలను సాధారణ ప్రయాణికులు ఉపయోగించుకునేలా కొత్త రూల్స్ రూపొందిస్తూన్నమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది..
జూలై 15, 2025 నుంచి తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత OTP ప్రామాణీకరణను తప్పనిసరి చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది..“తత్కాల్ టిక్కెట్లు బుకింగ్ సమయంలో వినియోగదారులు అందించిన మొబైల్ నంబర్‌కు సిస్టమ్ ద్వారా పంపబడే OTP ఆధారంగా మాత్రమే భారతీయ రైల్వేలు/అధీకృత ఏజెంట్ల కంప్యూటరైజ్డ్ PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్ల ద్వారా అందుబాటులో ఉంటాయని పేర్కొంది..
అధికారిక టికెటింగ్ ఏజెంట్లు ఇకపై రోజువారీ బుకింగ్ విండోలోని మొదటి అరగంట సమయంలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతి వుండదు..ఎయిర్ కండిషన్డ్ (AC) తరగతులకు, ఏజెంట్లు ఉదయం 10 గంటల నుండి 10.30 గంటల మధ్య బుకింగ్‌లు చేయకుండా నిషేధించారు.. నాన్-AC తరగతులకు, ఈ పరిమితి ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు నిషేధం వుంటుంది..బుకింగ్ వ్యవస్థలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధునికరించాలని,,అన్ని జోనల్ రైల్వే డివిజన్లకు తెలియజేయాలని CRIS-IRCTC లను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

