వైసీపీ ప్రభుత్వంలో లేవని నారాయణ మూర్తి గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తొంది-నట్టి.కుమార్
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో కొద్దొ గొప్పొ పేరు వున్న నటుడు,నిర్మాత,దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఏ.పి డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో వున్న విలువ పొగొట్టుకున్నడని నిర్మాత నట్టికుమార్ వ్యాఖ్యనించారు..శనివారం ఉదయం ఆర్.నారాయణ మూర్తి మీడియా సమావేశంలో మాట్లుడుతూ “హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం.. పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుంది.. తన చిత్రం హరిహర వీరమల్లు ప్రస్తావన లేకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ కల్యాణ్ పై గౌరవం మరింత పెరిగేది..థియేటర్ల బంద్ అనేది బ్రహ్మాస్తం..సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది” అని అన్నారు..
వైసీపీ ప్రభుత్వంలో లేవని గొంతు:- ఆర్.నారాయణమూర్తి మాటలకు,,నిర్మాత నట్టికుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.. నారాయణమూర్తి మాట తీరుని ఆయన ఖండించారు.. వైసీపీ ప్రభుత్వంలో లేవని గొంతు ఇప్పుడు ఎలా లేచిందని ప్రశ్నల వర్షం కురిపించారు..”నాడు జగన్ చేసిన అరాచకాల గురించి మీరు మాట్లాడరు..500 రూపాయల టికెట్ ఉంటే మీరు మాట్లాడరు.. నిజమైన ఎగ్జిబ్యూటర్లకు నష్టం జరుగుతుంటే మీరు మాట్లాడరు..ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది..? ఖండించాల్సిన అవసరం ఏముంది..? థియేటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారు ? మీకు సమాధానం తెలుసా ? దానికి మీరు జవాబు చెప్పారా ?. మీతో మీటింగ్ పెట్టించిన వారు,,మీతో మాట్లాడించిన వారు ఆ విషయం చెప్పలేదా అని అడుగుతున్నా..ఆ రోజు చిరంజీవి,,ఇతర సినీ పెద్దలను అవమానించినప్పుడు,,ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఒక్కసారైనా మీరు ఖండించారా? ఆరోజు మీరు ఖండించి ఉంటే మీకు అభినందనలు చెప్పేవాళ్లం.. చిరంజీవిని అవమానించడం తప్పు అని ఆరోజు మేము మాట్లాడాం..5వ షో ఇవ్వలేదని మాట్లాడాం” అని ఆర్ నారాయణమూర్తిపై మండిపడ్డారు.

