మేం దాడులకు సిద్దం అయ్యే లోపే,భారత్ విధ్వసం సృష్టించింది-షహబాజ్ షరీఫ్
ఏప్రిల్ 22వ తేదిన పహల్గమ్ లో పాకిస్తాన్ నుంచి పుట్టుకు వచ్చిన ఉగ్రవాదులు,,భారత్ అడబిడ్డల నుదట సింధూరం చెరిపిన తరువాత ఉగ్రవాదుల తయారీ ఫ్యాకర్టీ అయిన పాకిస్తాన్,భారత్ నుంచి కలలో కూడా ఉహించన విధ్వసం, ఉగ్రదేశం చవిచూసింది..ఇప్పటి వరకు ప్రపంచ దేశాల ముందు తామే భారతదేశంపై దాడులు జరిపి పై చెయ్యి సాధించామని బొంకుతున్న పాకిస్తాన్,,టర్కీ- అజరమైజన్ దేశ నాయకుల ముందు గొడు వెళ్లబొసుకుంది..
అమరావతి: మే 7వ తేదిన భారతదేశం తమ దేశంలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది..ఇందుకు ప్రతిగా, భారత్‌పై పాక్ ఆర్మీ దాడి చేయడానికి అంతా సిద్ధం చేసుకుందని,,ఇంత లోపే భారత్ బ్రహ్మోస్ మిస్సైల్స్ తో దాడి చేసిందని పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ఎట్టకేలకు నిజాన్ని బయట పెట్టారు..కీలక మిలటరీ బేస్‌లతోపాటు ఎయిర్‌పోర్టుపై దాడి చేసి తమను ఊహించని దెబ్బ కొట్టిందని అన్నారు..అజర్‌బైజాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ “ మే 10వ తేదీన ఇండియాపై దాడులు చేయడానికి పాకిస్థాన్ ఆర్మీ అంతా సిద్ధం చేసుకుంది..ప్రార్థనలు పూర్తయిన తరువాత తెల్లవారుజామున 4.30 గంటలకు దాడి చేద్దామని అనుకున్నాం..అయితే పాకిస్థాన్ దాడి చేయడానికి ముందే ఇండియా దాడులు మొదలుపెట్టింది..పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిస్ మిస్సైల్స్‌తో దాడులు చేసింది..రావల్‌పిండిలోని ఎయిర్‌పోర్టుపైనా దాడి చేసింది” అని అన్నారు.

