AP&TGNATIONAL

కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

వేసవికాలం అంటే మార్చి రెండవ వారం నుంచి జూన్ రెండవ వారం వరకు అంటే జూన్13వ తేది వరకు సాధరణంగా పరిగణిస్తారు..ఇందులో వేసవికాలం చివరి కారై అయిన రోహిణి ప్రవేశించిందంటే,రోళ్లు పగిలేలా మండే ఎండల భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావలంటే హడలి పోతారు..ఈ సమయంలోనే వడదెబ్బకు చాలా మరణాలు సంభవిస్తాయి..ఈ సంవత్సరం ఇందుకు భిన్నంగా  నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడంతో,,ప్రజలు రోహిణి కారైనుంచి తప్పించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నరంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది.?

నైరుతి రుతుపవనాలు కేరళను శనివారం (24 మే 2025)న తాకాయి.. సాధారణంగా జూన్ 1వ తేదీకి బదులుగా, 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి..2009 మే 23న కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత, 16 సంవత్సరాల తరువాత మళ్లీ రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది..కేరళలో రుతుపవనాల గమనం క్రింద విధంగా వుంది.

దక్షిణాది రాష్ట్రాల్లో:- దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, దక్షిణ కర్ణాటక, కొంకణ్, గోవాలో అతి భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది..మే 29వ తేది వరకు కేరళ తీరప్రాంతంమైన కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది..ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీస్తాయని తెలిపింది..తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లలో కూడా రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ ఉరుములు,, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *