NATIONALOTHERSTECHNOLOGY

దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం

నెల్లూరు: భారతదేశంకు సంబంధించిన GPS సేవలను అందించే NAVIC రెండో సిరీస్‌కి చెందిన NVS-02 శాటిలైట్ ను మే 18వ తేది ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV C-61 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు..జనవరి 2025లో 100 వ రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో, దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో 101వ రాకెట్ ప్రయోగంకు సిద్దం అవుంతొంది..భూ పరిశోధన ఉపగ్రహంను కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు..శనివారం ఉదయం 7:59 గంటలకు ఈ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది..నిరంతరంగా 22 గంటల పాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్ నింగులోకి దూసుకెళ్లనుంది.. ఈ ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో చైర్మన్ నారాయణన్ గురువారం సాయంత్రమే షార్ కు చేరుకున్నారు…భారతదేశంకు సంబంధించిన GPS సేవలను అందించే NAVIC ఇచ్చే సమాచారం,, మ్యాప్‌లకు బాగా ఉపయోగపడు తుంది.. భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది..మొత్తం 2,250 కేజీల బరువు ఉన్న శాటిలైట్.. ఇది భూ కక్ష్యా మార్గంలోకి వెళ్లాక, GPS సేవలను నిరంతరాయంగా అందిస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *