జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై మిస్సైల్,డ్రోన్స్ ను ప్రయోగించిన పాక్-ఆకాశంలో కూల్చివేసిన సైన్యం
అమరావతి: ఆపరేషన్ సిందూర్ తరువాత జమ్ము ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాకిస్తాన్ గురువారం రాత్రి ఆత్మాహుతి డ్రోన్లతో దాడులకు దిగింది.. ఎయిర్‌పోర్టుకు సమీపంలో రెండు శక్తివంతమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయి..భారత్-పాక్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది..పాకిస్తాన్,,జమ్ము ఎయిర్ స్ట్రిప్‌పై మిస్సైల్ అటాక్ చేసింది..జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్ అటాక్ చేయగా, 8 పాక్ మిస్సైల్స్‌ను భారత్ చాకచక్యంగా కూల్చేసింది..S-400 సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్ ను భారత్ ధ్వంసం చేసింది..భారత సేనలు జమ్ము,,కశ్మీర్,, రాజస్థాన్‌ను బ్లాకౌట్ చేసి, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది..పలుచోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేయగా, పోరు హోరా హోరీగా సాగుతోంది..జమ్ములో ఏడు చోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి..జమ్ము, కశ్మీర్, అఖ్నూర్, పూంచ్‌లో సైరన్‌లు మారుమ్రోగాయి.. పఠాన్‌కోట్ ఎయిర్‌పోర్టును పాక్ టార్గెట్ చేసింది..ఇదే సమయంలో కుప్వారాలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి..

