గుజరాత్ పర్యటన ముగించుకుని తిరిగి విజయవాడకు మంత్రి పొంగూరు నారాయణ బృందం
అమరావతి: గుజరాత్ లోని గ్యాస్పూర్ లో, జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ ను మంత్రి నారాయణ బృందం సోమవారం సందర్శించింది.. ఘన వ్యర్ధాల నుంచి విద్యుత్,పేవర్ బ్లాక్స్ తయారుచేసే విధానాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు..రాజధాని నిర్మాణంలో ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు.. ప్రతి రోజూ పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్ధాలను డికంపోజ్ చేసే విధానాన్ని అక్కడి అధికారులు మంత్రి నారాయణ టీమ్ కు వివరించారు.. అనంతరం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను పరిశీలించారు.. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీ పరిశీలించారు.. రెండు రోజులపాటు బిజిబిజిగా గడిపిన మంత్రి నారాయణ బృందం తిరిగి విజయవాడకు బయల్దేరారు.

