భారత్ పై టారిఫ్ లు 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించే ఆలోచన! అమెరికా
అమెరికాకు తత్వం భొధపడిందా?
అమరావతి: భారత్ ఎగుమతులపై భారీ సుంకాలు విధిస్తున్న అమెరికా,, జనవరి 27వ తేదిన భారత్-ఈయుల మధ్య కుదరున్నను స్వేఛ్చ వాణిజ్య ఒప్పదంతో తన విధించిన టారిఫ్ లు,అమెరికాకే బుమారంగ్ అవుతున్న విషయం గ్రహించినట్లుగా కన్సిస్తొంది. అమెరికా టారిఫ్ లు విధించిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడకుండా,,నిశబ్దంగా భారతదేశంకు అవసరమైన వాణిజ్య ఒప్పందలు చేసుకుంటు వెళ్లుతున్నాడు. యూరప్ దేశాలు కూడా వాళ్ల ఆర్దిక వ్యవస్థలు పతానవస్థ నుంచి తప్పించుకోవాలంటే,,భారత్ మార్క ట్లు తప్ప వేరే దారి వారికి కన్పించడం లేదు.. ఇప్పటికే యూరప్ నుంచి కొన్ని దేశాలు విడివిడిగా భారత్ కు వచ్చి కొన్ని రకాల వాణిజ్య ఒప్పందాలు చేసుకుని వెళ్లుతున్నాయి. ఇదంతా గమనిస్తున్న అమెరికాకు,,దిక్కు తొచడం లేదు. ఒక్క సారిగా టారిఫ్ లు తగ్గిస్తే,,ప్రపంచ దేశాల ముందు పరువు పోతుందని గ్రహించిన తిక్క ట్రంప్ బృందం,,రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న అయిల్స్ తగ్గినందు వలనే,,టారిఫ్ లు తగ్గించేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ అన్నారు.భారత్ పై టారిఫ్ లు 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించే ఆలోచన ఉందని వెల్లడించారు..మన పెద్ద వారు ఒక సమెత అంటుంటారు…చెరువు మీద కొపంతో….. వాసన మనకే అని…ఇప్పటికైన అమెరికాకు తత్వం భొధపడితే అమెరికా ప్రజలకే మేలు జరుగుతుంది.

