హార్ముజ్ జలసంధిలో నౌకలకు అనుమతి-షరతులు వర్తిస్తాయి-ఇరాన్
అమరావతి: ఇరాన్, మూసివేతతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచ దేశాలకు ఊరటం ఇచ్చేలా “జలసంధిని తెరుస్తున్నట్లు” కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో నౌకల రవాణాకు అనేక షరతులు వర్తిస్తాయని తెలిపింది. తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని మాత్రమే ఈ జలసంధి నుంచి అనుమతిస్తామని, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO)కు ఇరాన్ లేఖ ద్వారా తెలిపింది.
తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని, తమ దేశ రక్షణ, భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటే మాత్రమే అనుమతిస్తామని ప్రకటనలో పేర్కొంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి కార్యకలాపాలతో సంబంధం ఉండకూడదు. ఇరాన్‌తో కలిసి సమన్వయం చేసుకుని నౌకల్ని రవాణా చేసుకోవాలి. ఇజ్రాయెల్, అమెరికాలకు చెందిన ఎలాంటి నౌకల్ని ఇరాన్ ఈ జలసంధి మార్గంలో అనుమతించదు.ఇదే సమయంలో ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ టోల్ ఫీజలు వసూలు చేయడం ప్రారంభించినట్లు సమాచారం.

